ఆరురోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలి : సీఎస్
ధాన్యం సేకరణ పూర్తి చేయాలి | రాష్ట్రవాప్తంగా మరో ఆరురోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు.

అమరావతి : రాష్ట్రవాప్తంగా మరో ఆరురోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. హమాలీలు, గోనె సంచుల కొరత ఉంటే సమకూర్చుకోవాలని సూచించారు. ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. మిల్లర్లు తుకాల్లో తరుగు తీయకుండా తనిఖీలు చేయాలని చెప్పారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ జరిగేలా చూడాలన్నారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
సమావేశంలో ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, సరఫరా, సూపర్ స్ప్రెడర్లలకు వ్యాక్సినేషన్ తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న ఖరీఫ్ సీజన్ సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువుల నిల్వలు ఉండేలా చూడాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారులతో కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. సూపర్ స్ప్రెడర్ల కేటగిరిలో నిర్దేశించిన వారికే కొవిడ్ టీకాలు వేయాలని అన్నారు. సూపర్ స్ప్రెడర్లకు కొవిషీల్డ్ టీకాలు మాత్రమే వేయాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

