నత్తనడకన పట్టభద్రుల ఓట్ల నమోదు!
రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. దరఖాస్తుల పరిశీలన కూడా నత్తనడకను తలపిస్తున్నది. సీఈవో కార్యాలయం అధికారిక నివేదిక ప్రకారం.. సోమవారం సాయంత్రం వరకు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది జిల్లాల నుంచి మొత్తం 1,84,883 ఫామ్-18 దరఖాస్తులు అందాయి. వీటిలో 2,046 ఆమోదం పొందగా, 52 తిరసరణకు గురయ్యాయి. ఇంకా 1,82,785 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
- రెండు నియోజకవర్గాల్లో అందిన దరఖాస్తులు 4,21,941
- పెండింగ్‌లో ఉన్నవి 4,12,678
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. దరఖాస్తుల పరిశీలన కూడా నత్తనడకను తలపిస్తున్నది. సీఈవో కార్యాలయం అధికారిక నివేదిక ప్రకారం.. సోమవారం సాయంత్రం వరకు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది జిల్లాల నుంచి మొత్తం 1,84,883 ఫామ్-18 దరఖాస్తులు అందాయి. వీటిలో 2,046 ఆమోదం పొందగా, 52 తిరసరణకు గురయ్యాయి. ఇంకా 1,82,785 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
అంటే అందిన దరఖాస్తుల్లో సుమారు 98.9 శాతం పరిషారానికి నోచుకోలేదు. దరఖాస్తుల పరిషారంలో ఈ స్థాయి జాప్యం కొనసాగితే, గడువులోగా నమోదు ప్రక్రియ పూర్తవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలో పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నది. ఈ పరిధిలో 2,37,058 దరఖాస్తులు అందగా, 6,550 మాత్రమే ఆమోదం పొందాయి. 615 తిరసరించారు. మరో 2,29,893 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
అంటే ఈ నియోజకవర్గంలోనూ వచ్చిన దరఖాస్తుల్లో 96 శాతానికిపైగా ఇంకా పరిషారం కావాల్సి ఉన్నది. రెండు నియోజకవర్గాల్లో కలిపి పెండింగ్ దరఖాస్తులు 4,12,678 ఉన్నారు. ఇందులో 3,40,121 దరఖాస్తులు బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్వో) స్థాయిలోనే పెండింగ్ ఉన్నాయి. మరో 9,410 ఏఈఆర్వోల వద్ద, 29,292 దరఖాస్తులు ఈఆర్వోల వద్ద మూలుగుతున్నాయి. అదనంగా 33,855 దరఖాస్తులు ఇంకా ప్రాసెస్ చేయలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
బీఎల్వోల స్థాయిలోనే ఇంత భారీ సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోవడానికి సిబ్బంది కొరత, క్షేత్రస్థాయి పరిశీలనలో జాప్యం లేదా ఇతర పరిపాలనా సమస్యలు కారణమా అన్నది అధికారులు స్పష్టం చేయాల్సి ఉన్నది. ఓటరు నమోదు దరఖాస్తుకు నవంబర్ 6 చివరి తేదీగా ఉన్నది. పట్టభద్రుల్లో నమోదు పట్ల ఆసక్తి తకువగా ఉన్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఉన్నత విద్యను అభ్యసించినవారిలోనూ ఓటరు నమోదు ప్రక్రియపై తగిన అవగాహన లేకపోవడం, దరఖాస్తు విధానంపై స్పష్టత కొరవడటం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయా? అనేది పరిశీలించాల్సి ఉన్నది.

Ppp
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

