OU EMRC | ఓయూ ఈఎంఆర్‌సీకి అంతర్జాతీయ గుర్తింపు
OU EMRC | ప్రతిష్టాత్మక యూజీసీ - సీఈసీ 16వ అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషన్ అండ్ మల్టీమీడియా రీసర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ) అవార్డు గెలుచుకుంది.
OU EMRC | ఉస్మానియా యూనివర్సిటీ : ప్రతిష్టాత్మక యూజీసీ – సీఈసీ 16వ అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషన్ అండ్ మల్టీమీడియా రీసర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ) అవార్డు గెలుచుకుంది. దీంతో ఈఎంఆర్‌సీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. జోధ్‌పూర్‌లో జరిగిన ఈ ఫెస్టివల్లో అవార్డు పొందిన ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతిరెడ్డిని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ అభినందించారు.

సమాజానికి దూరంగా అడవుల్లో బ్రతుకుతున్న గుత్తికోయ చిన్నారుల బతుకు చిత్రంపై తీసిన ‘రీచింగ్ ది అన్ రీచ్డ్’ షార్ట్ ఫిల్మ్‌కు అభివృద్ధి విభాగంలో ట్రోఫీ, నగదు బహుమతి, ధృవపత్రం లభించడం, మానవహక్కుల విభాగంలో స్క్రీనింగ్‌కు ఎంపికవడం ఓయూకు గర్వకారణమని వీసీ అభిప్రాయపడ్డారు. సామాజిక, అభివృద్ధి, విద్యా, ఆధునిక సాంకేతికత, పరిశోధనలు ఇతివృత్తంగా మరిన్ని లఘుచిత్రాలు రూపొందించాలని సూచించారు. అవార్డుతో పాటు వచ్చిన నగదు బహుమతి రూ.50 వేలను వీసీ చేతుల మీదుగా గుత్తి కోయ చిన్నారుల విద్యాభ్యాసం కోసం శ్రమిస్తున్న సంతోష్ ఇస్రం మిత్ర బృందానికి విరాళంగా అందజేశారు.
రఘుపతిరెడ్డి మాట్లాడుతూ.. అవార్డు తనపై బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. మారుమూల గిరిజన విద్యార్థులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో తామంతా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్‌నాయక్, యూజీసీ డీన్ ప్రొఫెసర్ లావణ్య, ప్రొఫెసర్ ప్యాట్రిక్, ప్రొఫెసర్ స్టీవెన్సన్, ప్రొఫెసర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | ఓయూ పరిధిలో ఎంఎంఎస్ పరీక్షా ఫీజు స్వీకరణ
KTR | ఢిల్లీకి అందే మూటల మీద ఉన్న శ్రద్ధ.. మీరిచ్చిన మాట మీద లేదా.. రాహుల్‌గాంధీని నిలదీసిన కేటీఆర్
Secretariat | రేపట్నుంచే సచివాలయంలో ‘ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్’ అమలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

