OU Exams | ఆగస్టు 16 నుంచి ఓయూ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు..!
OU Exams | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన పీజీ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్‌ను రీ షెడ్యూల్ చేశారు. జులై 28 నుంచి నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 16 నుంచి నిర్వహించాలని ఓయూ అధికారులు నిర్ణయించారు.
OU Exams | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన పీజీ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్‌ను రీ షెడ్యూల్ చేశారు. జులై 28 నుంచి నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 16 నుంచి నిర్వహించాలని ఓయూ అధికారులు నిర్ణయించారు. రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.
ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో పీజీ సెమిస్టర్ ఎగ్జామ్స్‌తో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి క్యాంపస్, అనుబంధ కాలేజీలు, జిల్లా పీజీ సెంటర్ల ప్రిన్సిపాల్స్‌తో పాటు ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు హాజరయ్యారు.
పీజీ సెమిస్టర్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని ఇటీవలే ఓయూ విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సిలబస్ పూర్తి కానీ సందర్భంగా ఎగ్జామ్స్ వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మొత్తానికి ఎగ్జామ్స్‌ను ఆగస్టు 16 నుంచి నిర్వహించనున్నారు. జులై 26, 27 తేదీల్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

