హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎంకామ్ (ఐఎస్), ఎంఎస్డబ్ల్యూ, ఎమ్మెస్సీ, ఎంలిబ్ఐఎస్సీ, ఎంజేఅండ్ఎంసీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను వచ్చే నెల 2వ తేదీ నుంచి, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను వచ్చే నెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.