తెలంగాణ ఆలయాల్లో గో ఆధారిత నైవేద్యం ప్రవేశపెట్టండి
Telangana Temples | తిరుమల తిరుపతి దేవస్థానంలో గో ఆధారిత నైవేద్యం సమర్పిస్తున్నట్లుగానే తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో గో ఆధారిత నైవేద్యం ప్రవేశపెట్టాలని యుగ తులసి, సేవ్ ఫౌండేషన్ నిర్వహకులు దేవాదాయ శాఖ మంత్రిని

హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానంలో గో ఆధారిత నైవేద్యం సమర్పిస్తున్నట్లుగానే తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో గో ఆధారిత నైవేద్యం ప్రవేశపెట్టాలని యుగ తులసి, సేవ్ ఫౌండేషన్ నిర్వహకులు దేవాదాయ శాఖ మంత్రిని కోరారు. శనివారం అరణ్య భవన్లో యుగ తులసి ఛైర్మన్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు కె శివ కుమార్, సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ రామకుమార్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.
దేశ వ్యాప్తంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించేందుకు వారు పండించిన ఉత్పత్తులను ఆలయాల్లో వినియోగించి, గో ఆధారిత నైవేద్యం సమర్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. త్వరలో పునః ప్రారంభం కానున్న యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి ఆలయంలో స్వామివారికి గో ఆధారిత నైవేద్యాన్ని ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ఆలయాల్లో గో ఆధారిత నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని మొదలు పెడితే ఇక్కడ గో సంతతి వృద్ది చెందుతుందన్నారు. రైతులను మరింత ప్రోత్సహించేందుకు గోఆధారిత వ్యవసాయంపై వారికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు.
దేవతామూర్తులకు స్వచ్ఛమైన ఆవుపాలు, నెయ్యి, బియ్యం, పప్పులు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ద్వారా యుగ తులసి, సేవ్ ఫౌండేషన్ల కృషి అభినందనీయమన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణలోని దేవాలయాల్లో గో ఆధారిత నైవేధ్యాన్ని ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

