హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకే కాకుండా స్టార్టప్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారిందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ చెప్పారు. డ్రాపర్ స్టార్టప్ హౌస్ కంపెనీ హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన కోవర్కింగ్ ఆఫీస్ స్పేస్ కార్యాలయాన్ని టీ హబ్ సీఈవో ఎంఎస్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా కోవర్కింగ్ ఆఫీస్ స్పేస్ కార్యాలయాలను కలిగిన డ్రాపర్ స్టార్టప్ హౌస్ 22 చోట్ల నిర్వహిస్తున్న వాటిల్లో హైదరాబాద్ సెంటర్ అతి పెద్దదని తెలిపారు.