సూపర్ స్ప్రెడర్లకు కొనసాగుతున్న వ్యాక్సినేషన్ .. రేపు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు
రేపు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు వ్యాక్సినేషన్ | రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ వేగవంతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రేపు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు రవాణాశాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ వేగవంతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రేపు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు రవాణాశాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఇందుకు కోసం జీహెచ్ఎంసీ పరిధిలో 10 టీకా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారు టీకా కేంద్రాలకు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వాహనం ఆర్సీ వెంట తెచ్చుకోవాలని రవాణాశాఖ అధికారులు సూచించారు.
కరోనా కట్టడిలో భాగంగా నిత్యం వందల మందిని కలిసే అవకాశమున్నవారిని ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి వీరందరికీ టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. పౌరసరఫరాల శాఖ సిబ్బంది, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, వీధి వ్యాపారులు, జర్నలిస్టులు, వివిధ దుకాణాల్లో పనిచేసే వారిని సర్కార్ సూపర్ స్ప్రెడర్ల కేటగిరీలో చేర్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

