శాంతిభద్రతల్లో హైదరాబాద్‌కు తిరుగులేదని మరోసారి తేటతెల్లమైంది. అతివలకు అత్యంత భద్రనగరి భాగ్యనగరేనని మరోసారి స్పష్టమైంది. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలతో పరిఢవిల్లిన హైదరాబాద్.. దేశంలోనే టాప్-5 మహిళా సురక్షా నగరాల్లో ఒకటిగా నిలిచింది. 87.5శాతం మంది నగర జీవనంపై సంతృప్తిని వ్యక్తంచేసినట్టు డీఈఐ సొల్యూషన్స్ సంస్థ ‘అవతార్’ వెల్లడించింది.
Hyderabad | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’.. ఎకడైతే స్త్రీలు గౌరవింపబడతారో అకడ దేవతలు కొలువై ఉంటారు.. అనే స్ఫూర్తి తెలంగాణలో విరాజిల్లుతున్నది. పదేండ్ల పాలనలో కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా హైదరాబాద్ నగరంలో మహిళలు భద్రంగా, భరోసాతో జీవనం సాగిస్తున్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్‌తో మహిళ భద్రతే తమ తొలి ప్రాధాన్యమని కేసీఆర్ చాటిచెప్పా రు. మహిళా సమస్యసలపై ‘సాహస్’అస్త్రాన్ని సంధించారు. షీ టీమ్ తీసుకొచ్చి పోకిరీల్లో వణుకు పుట్టించారు. పసిపాప నుంచి కాలేజీకి వెళ్లే అమ్మాయి వరకు, ఇంట్లో గృహిణి నుంచి పనిప్రదేశంలో మహిళ వరకు అందరికీ నేనున్నానంటూ ‘భరోసా’ కల్పించారు.
ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలతో హైదరాబాద్ నగరాన్ని ఆడబిడ్డలకు రక్షణ వలయంగా తీర్చిదిద్దారు. తాజాగా మహిళల సంరక్షణ, ఉ పాధి, వసతి, పని ప్రదేశాల్లో భద్రత వంటి 17 అంశాల్లో అవతార్ సంస్థ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో దేశంలోని టాప్-5 నగరాల్లో హైదరాబాద్ చోటు దక్కించుకున్నది. డ్రైవర్సిటీ, ఈక్వి టీ అండ్ ఇన్‌క్లూజన్ (డీఈఐ) సొల్యూషన్స్‌లో అగ్రగామి సంస్థగా పేరొందిన అవతార్ దేశవ్యాప్తంగా 113 నగరాల్లో ‘టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా-2023’ పేరుతో సర్వే నిర్వహించింది. జూలై 2023- డిసెంబర్ 2023 మధ్య దేశంలోని 1,200 మంది మహిళల అభిప్రాయాలు సేకరించింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, జాతీయ జనాభా గణన, నేరాల రికార్డులతోపాటు వివిధ ప్రభుత్వ వనరుల నుంచి సేకరించిన డాటాలను కూడా సర్వేలో పరిగణలోకి తీసుకున్నది. సోషల్ ఇన్‌క్లూషన్ స్కోర్ (ఎస్ఐఎస్), ఇండస్ట్రియల్ ఇన్‌క్లూజన్ స్కోర్(ఐఐఎస్), సిటిజన్ ఎక్స్పీరియన్స్ స్కోర్ (సీఈఎస్) వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని సర్వే చేపట్టింది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో చెన్నై, రెండోస్థానంలో బెంగళూరు, మూడోస్థానంలో ఫుణె, నాలుగోస్థానంలో ముంబై ఉన్నాయి. ఆరు నుంచి పదో స్థానం వరకు వరుసగా కోల్‌కతా, అహ్మదాబాద్, డిల్లీ, కోయంబత్తూర్, జైపూర్ నిలిచాయి.
దేశంలోని 113 నగరాల్లో జీవించడంపై ఎంతమంది సంతృప్తితో ఉన్నారు? ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు? వంటి అంశాలను అవతార్ సంస్థ వెల్లడించింది. పిల్లల విద్య, ఉన్నత విద్య, హెల్త్‌కేర్, ఉద్యోగ అవకాశాలు, పిల్లల సంరక్షణ, వినోదం, సేఫ్టీ, హౌసింగ్, ఉత్తమ జీవన ప్రమాణాలు, రవాణా సౌకర్యం, ఇంటి అద్దెలు, ఉమెన్ హాస్టల్స్, తాత్కాలిక వసతి సౌకర్యాలు, బిల్డింగ్ నెట్వర్క్, గ్రీన్ స్పేస్, ప్రభుత్వ సంస్థల స్పందన, మహిళా పోలీస్ అధికారులు అనే అంశాలను వివరించింది. అందులో హైదరాబాద్‌లో జీవించడంపై 50 శాతం మంది స్త్రీలు చాలా సంతోషంగా ఉన్నారు. 37.5 శాతం మంది స్త్రీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవిస్తున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 12.5 శాతం మంది మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. చెన్నైలో 55.6 శాతం మంది పాజిటివ్ అభిప్రాయాన్ని చెప్పగా, 44.4 శాతం మంది తటస్థంగా ఉన్నారు. శక్తివంతమైన ఉపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్యం, సంరక్షణ, ఉత్తమ జీవన ప్రమాణాలు వంటి విషయాల్లో దేశంలోని టాప్-5 నగరంగా హైదరాబాద్ నిలిచిందని అవతార్ సంస్థ ఫౌండర్ డాక్టర్ సౌందర్య రాజేశ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు మహిళల రక్షణ, అభివృద్ధికి ఎన్నో గొప్ప సం స్కరణలు ప్రవేశ పెట్టింది. దేశంలోనే తొలిసారిగా ఉమెన్ సేఫ్టీ వింగ్‌ను ప్రారంభించారు. ఆడబిడ్డకు ఆపదొస్తే ‘షీ టీమ్స్’ గుర్తుకు వచ్చే లా వ్యవస్థను తీర్చిదిద్దారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ లో ప్రధానంగా ఎనిమిది విభాగాలు నిరంతరం పనిచేస్తున్నాయి. షీ టీమ్, భరోసా, సా హస్, ఎన్ఆర్ఐ సెల్, ప్రైడ్ ప్లేస్ సెల్, యాంటీ హ్యూమన్ ట్రాఫెకింగ్, ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్, సైబర్ అంబాసిడర్ ప్లాట్‌ఫామ్(సీఏపీ)లు నిరంతరం స్త్రీల కోసం పనిచేస్తున్నా రు. లైంగిక బాధితులకు అండగా ఉండేందుకు ఉమెన్ సేఫ్టీ వింగ్లోనే ‘భరోసా’ విభాగం పనిచేస్తున్నది. మృగాళ్ల వేధింపులు అరికట్టేందుకు ‘సాహస్’ అనే (మాడ్యూల్) తీసుకొచ్చారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఉమెన్ సేఫ్టీ వింగ్‌లోని ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్’ మాడ్యూల్ తీవ్రంగా శ్రమిస్తున్న ది. రాష్ట్రవ్యాప్తంగా 30 ఏహెచ్‌టీ యూనిట్ల నుంచి తన పనిని నిర్వర్తిస్తున్నది. ఇలా.. ప్రతివింగ్కు సమర్థ అధికారులను నియమించారు. ఫలితంగా.. దేశంలోనే సేఫ్టీ ప్రదేశాల్లో హైదరాబాద్ టాప్ 5 నగరాల్లో నిలిచింది.
షీ టీమ్, భరోసా, సాహస్, ఎన్ఆర్ఐ సెల్, ప్రైడ్ ప్లేస్ సెల్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్, సైబర్ అంబాసిడర్ ప్లాట్‌ఫామ్ (సీఏపీ).