వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని అంతరాం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.