పోచమ్మమైదాన్, మే 31: వరంగల్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం రోజే కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేశారు.
సమావేశంలో ఎర్రబెల్లి స్వర్ణ, కొండ వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది. కొంతమంది కార్యకర్తలు చెప్పులు, పిడిగుద్దులతో దాడి చేసుకొన్నారు.