తెలంగాణ చేనేత విధానాలు అద్భుతం
తెలంగాణ చేనేత, టైక్స్టైల్స్ విధానాలు అద్భుతమని ఒడిశా చేనేత, జౌళి శాఖమంత్రి రీటా సాహూ కితాబిచ్చారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రశంసల వర్షం కురిపించారు.
- ఒడిశాలోనూ అమలు చేస్తాం
- ఒడిశా చేనేత, జౌళి శాఖ మంత్రి రీటా సాహూ వెల్లడి
- రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో భేటీ
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చేనేత, టైక్స్టైల్స్ విధానాలు అద్భుతమని ఒడిశా చేనేత, జౌళి శాఖమంత్రి రీటా సాహూ కితాబిచ్చారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ టైక్స్టైల్స్, చేనేత కార్యక్రమాలపై అధ్యయనం చేసేందుకు ఒడిశా మంత్రి నేతృత్వంలోని అధికారుల బృందం రాష్ర్టానికి వచ్చింది. రాష్ట్రం లో నేతన్న సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై అధ్యయనం చేసింది. పోచంపల్లి, కొయ్యలగూడెంలోని చేనేత క్లస్టర్లను సందర్శించింది. అక్కడ ఉత్పత్తి చేస్తున్న ఇక్కత్ పట్టు చీరలు, డిజైన్ల గురించి తెలుసుకున్నారు.
డబుల్ ఇక్కత్ ద్వారా తయారు చేస్తున్న బెడ్షీట్లు, ఇతర ఫర్నిషింగ్ ఉత్పత్తులను పరిశీలించారు. ఇక్కత్ చీర తయారీలో చేనేత కార్మికుల నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లో రాష్ట్ర టెక్స్టైల్స్, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుతో రీటా సాహూ భేటీ అయ్యారు. నేతన్నల సంక్షేమం, టెక్స్టైల్స్, చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాల గురించి ఒడిశా మంత్రికి కేటీఆర్ వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెక్స్టైల్స్ శాఖ బడ్జెట్ అనేక రెట్లు పెంచడం, ముడిసరుకుపై ఇచ్చే సబ్సిడీ, బీమా సౌకర్యం గురించి తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడైనా పవర్లూమ్ సంక్షోభం తలెత్తితే అన్నివిధాలుగా తట్టుకునేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్టు వివరించారు.
అందులో భాగంగానే బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ కాకతీయ మెగా టైక్స్టైల్స్ పార్కు, సిరిసిల్లలో అపరెల్ పార్కులు నెలకొల్పామని చెప్పారు. కేవలం ఎనిమిదేండ్లలో టైక్స్టైల్స్ రంగం అభివృద్ధికి తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలపై ఒడిశా మంత్రి రీటా సాహూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేతన్న బీమా, నేతన్న పొదుపు పథకాలు, ముడిసరుకుపై 55 శాతం సబ్సిడీ, బడ్జెట్లో భారీగా కేటాయింపులు వంటి అంశాలపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ టెక్స్టైల్స్ శాఖ చేపట్టిన కార్యక్రమాల నివేదిక ఇస్తే తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు తమ ముఖ్యమంత్రితో మాట్లాడుతామని తెలిపారు. ఒకసారి ఒడిశాలో పర్యటించాలని మంత్రి కేటీఆర్‌ను రీటా సాహూ ఆహ్వానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

