మన మహిళ.. వ్యాపారవేత్త

- పారిశ్రామికులుగా వేగంగా ముందుకు
- సొంతూళ్లలోనే రూ.లక్షకు పైగా సంపాదన
- అండగా నిలుస్తున్న వీహబ్ ‘హర్ అండ్ నౌ’
- వ్యాపార మెలకువలు, మార్కెటింగ్‌పై శిక్షణ
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ఆడవాళ్లు వంటింటికి పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వీ-హబ్‌ను తీసుకొచ్చింది. దీనిద్వారా వాళ్లలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి, నైపుణ్యాన్ని అందించి జీవితంలో గొప్పగా ఎదిగేందుకు సహకారం అందిస్తున్నది. మహిళల వ్యాపార ఆలోచనలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకొని వారి జీవితాల్లో చిరుదివ్వెలు వెలిగిస్తున్నది. గ్రామాల్లోని మహిళలను ప్రోత్సహిస్తూ వారు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రత్యేక చొరవ తీసుకొంటున్నది. ఇందులోభాగంగానే జర్మనీ ప్రభుత్వ డెవలప్మెంట్ ఏజెన్సీ జీఐజెడ్తో కలిసి గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందించే ‘హర్ అండ్ నౌ’ కార్యక్రమాన్ని వీహబ్ చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో క్యాంపులు ఏర్పాటుచేసి వ్యాపార అవకాశాలు, అందిస్తున్న మద్దతు గురించి అవగాహన కల్పించింది. దరఖాస్తులు చేసుకొన్నవారి నుంచి లబ్ధిదారులను ఎంపికచేసి 7 నెలల పాటు శిక్షణ అందించింది. గతేడాదిలో 28 మందికి శిక్షణ ఇవ్వగా, ఈ ఏడాది 89 మంది శిక్షణ పూర్తి చేసుకొన్నారు. మెళకువలు నేర్చుకొన్నవాళ్లంతా సొంతంగా వ్యాపారం పెట్టుకోవటం, ఉన్న వ్యాపారాన్ని మరింత వృద్ధి సాధించేలా చేసుకోవటంలో నిమగ్నమయ్యారు. వివిధ కార్యక్రమాల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 577 మంది మహిళలకు వీహబ్ మద్దతు అందించగా, వారితో వేలమంది ఉపాధి పొందుతున్నారు.
వీహబ్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు అందిన మద్దతు
- 45% మందికి రూ.19.93 కోట్ల ఫైనాన్షియల్ లింకేజ్
- 34% మందికి ఆన్లైన్ అండ్ రిటైల్ మార్కెట్ లింకేజ్
- 29% మందికి సెక్టార్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పీరియన్స్
- 67% మంది వ్యాపారాన్ని క్రమబద్ధీకరించుకొని ఆర్థిక వృద్ధి చెందారు.
- 58% మంది ఉద్యోగాల కల్పనకు నాంది.
సంతోషంగా ఉంది
ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కలలు సాకారం చేయటంలో తోడ్పాటునందించటం సంతోషంగా ఉంది. కరోనా కష్టకాలంలోనూ మా మద్దతును కొనసాగించాం. వర్చువల్ మీడియం ద్వారా సెషన్స్ నిర్వహించాం. వీహబ్ మద్దతుతో ఎంతో మంది పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతూ మరెందరికో ఉపాధి కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న గొప్ప చొరవ ఇది. సహకరిస్తున్న అందరికి కృతజ్ఞతలు.
-దీప్తి రావుల, సీఈవో, వీహబ్
ట్రెండ్‌కు తగ్గట్టు చీరెలు
గతంలో మేం రూపొందించిన ఒక్కో చీర రూ.1000 వరకు విక్రయించేవాళ్లం. వీహబ్ ద్వారా మార్కెటింగ్ మెళకువలు నేర్చుకొని ఇప్పుడు ఒక్కో చీర రూ.2500 వరకు విక్రయిస్తున్నాం. కస్టమర్స్ నేరుగా రావటం వల్ల ఎక్కువ లాభం వస్తున్నది. ప్రస్తుతం నా వద్ద 10 మంది పని చేస్తున్నారు. ప్రతి నెల రూ.లక్ష దాకా ఆదాయం వస్తున్నది. శిక్షణలో భాగంగా మాకు హ్యామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీ ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పించారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు డిజైన్ చేయటం వల్ల కలిగే లాభాలు వివరించారు. దీని వల్ల మా చీరలకు డిమాండ్ పెరిగింది. వీహబ్ లోన్ ద్వారా ఆర్థిక సహాయం కూడా అందించింది.
-అశ్వినీ యెంగలి, హ్యాండ్లూమ్ వీవింగ్ ఆఫ్ పైతాని సిల్క్ సారీస్, నారాయణపేట
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

