హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్సు) పోస్టుల ఫైనల్ సెలక్షన్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(ఎంహెచ్ఎస్ఆర్బీ) గురువారం విడుదల చేసింది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు 2024 సెప్టెంబర్ 18న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించింది.
2,176 మంది అభ్యర్థులు నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు ఎంపిక కాగా.. తుది జాబితాను బోర్డు విడుదల చేసింది. స్పోర్ట్స్ క్యాటగిరీ అభ్యర్థుల సెలక్షన్ లిస్టును త్వరలో విడుదల చేయనున్నట్టు పేర్కొన్నది.