JEE Main Results | జేఈఈ మెయిన్ 2023 ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 సెషన్-2 (JEE Main Session- 2) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.
హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 సెషన్-2 (JEE Main Session- 2) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య 300/300 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. నగరానికే చెందిన సాయి దుర్గా రెడ్డి ఆరో ర్యాంక్ సాధించగా.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు విద్యార్థి పీ.లోహిత్ ఆదిత్య సాయి రెండో ర్యాంకు, అమలాపురానికి చెందిన కే.సాయినాథ్ శ్రీమంతకు పదో ర్యాంకు వచ్చింది.
విద్యార్థులు తమ ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో https://jeemain.nta.nic.in/లో చూసుకోవచ్చు. తమ అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి స్కోర్‌కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ సెషన్-1 జనవరిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 8.24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జరిగిన సెషన్-2 పరీక్షలకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా (పేపర్-1, 2).. 9 లక్షల మంది వరకు పరీక్షకు హాజరైనట్టు సమాచారం.
ఈ నెల 30 నుంచి అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు..
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఈ నెల 30 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 4న పరీక్ష జరుగనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

