TSPSC | టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల
TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ఆ దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు secy-ser-gad@telangana.gov.in మెయిల్‌కు పంపించవచ్చని పేర్కొంది. ఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది.
మరో టీఎస్పీఎస్సీ సభ్యురాలు రాజీనామా
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం మారడం.. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కలత చెందిన ఆమె శుక్రవారం గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చ పడిందని జరిగిన దుష్పరిణామాలకు సభ్యులుగా తమ ప్రమేయం ఏమీ లేదని అయినా కమిషన్ మార్పే ప్రక్షాళన అనే స్థాయిలో జరిగిన ప్రచారం తీవ్రంగా బాధించిందని సుమిత్రానంద్ అన్నారు. ఉద్యోగ నామ సంవత్సరం అనుకున్న సంవత్సరమే ఎన్నికల సంవత్సరం కావడం వల్ల తాము ఉద్యోగ నియామక ప్రక్రియను సజావుగా జరపలేకపోయామని సుమిత్రానంద్ విచారం వ్యక్తం చేశారు.
ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ జనార్ధన్‌రెడ్డి, సభ్యులు బండి లింగారెడ్డి, ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డిలు రాజీనామాలు సమర్పించారు. వీరి రాజీనామాలను ఇటీవలే గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సుమిత్ర ఆనంద్ తనోబా శుక్రవారం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకుని, తన సిబ్బంది ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపించారు. ప్రస్తుతం కోట్ల అరుణకుమారి ఒక్కరే కమిషన్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

