వరంగల్ : పీజీ డెంటల్ యజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా నేడు(నవంబర్10వ తేదీ) రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎండీఎస్ యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.
అర్హతలు కలిగిన అభ్యర్థులు నేటి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రాధాన్యతాక్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఖాళీ సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చామని, మరింత సమాచారం కోసం https://www.knruhs.telangana.gov.in/ వెబ్సైట్ని పరిశీలించవచ్చని తెలిపారు.