B Arch | బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఎన్ఎఫ్ఏయూ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలోని 10 కాలేజీల్లో 830 బీ ఆర్కిటెక్చర్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం నుంచి ఈ నెల 22 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 23 నుంచి 31 వరకు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నారు. ఆగస్ట్ 5, 6న తేదీల్లో బీ ఆర్క్ కోర్సుకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్ట్ 8న బీ ఆర్క్కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నది. మిగతా సీట్లకు ఆగస్టు 13, 14 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కన్వీనర్ తెలిపారు. పూర్తి వివరాలకు jnafau.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని కన్వీనర్ సూచించారు.