Telangana Budget | అసలు నిబంధన ఇదీ.. ఈ సారి గవర్నర్ ప్రసంగం లేనట్టే!
చ్చే బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కానున్నాయి. అయితే.. రాజ్యాంగ నియమ నిబంధనలు, సభా సంప్రదాయాలపై అవగాహన లేని ప్రతిపక్ష, బీజేపీ నేతలు కొందరు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలేంటని సందేహాలు లేవనెత్తుతున్నారు. నిజానికి బడ్జెట్ సమావేశాలకూ,
అక్టోబర్‌లో ప్రొరోగ్ కాని సమావేశాలు
ఇది క్యాలెండర్ ఇయర్లో తొలి సెషన్ కాదు
అసెంబ్లీ గత సమావేశాల కొనసాగింపే ఇవి
గవర్నర్ ప్రసంగం అవసరం లేదన్న నిపుణులు
హైదరాబాద్, ఫిబ్రవరి 28 : వచ్చే బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కానున్నాయి. అయితే.. రాజ్యాంగ నియమ నిబంధనలు, సభా సంప్రదాయాలపై అవగాహన లేని ప్రతిపక్ష, బీజేపీ నేతలు కొందరు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలేంటని సందేహాలు లేవనెత్తుతున్నారు. నిజానికి బడ్జెట్ సమావేశాలకూ, గవర్నర్ ప్రసంగానికీ ఎటువంటి సంబంధమూ లేదు. వాస్తవానికి ఇది ఒక చిన్న సాంకేతిక అంశం మాత్రమే. సభ నిబంధనలు తెలిసిన ఏ ఎమ్మెల్యేకైనా ఈ సాంకేతిక అంశం చాలా సులువుగానే అర్థమవుతుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో క్యాలెండర్ ఇయర్, సెషన్, సమావేశాలు.. అని మూడు అంశాలు ఉంటాయి. క్యాలెండర్ ఇయర్లో కొత్త సెషన్ మొదలైనప్పుడు జరిగే మొదటి సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. కొత్త సెషన్ అనేది పాత సమావేశాలు ప్రొరోగ్ అయిన తర్వాత ప్రారంభమయ్యేది. అసెంబ్లీ గత సమావేశాలు గత ఏడాది అక్టోబర్ 8న వాయిదా పడ్డాయి. సమావేశం ప్రొరోగ్ కాలేదు. ప్రొరోగ్ అయి ఉంటే.. ఆ సమావేశాల సెషన్ అప్పటికి ముగిసి ఉండేది. ప్రొరోగ్ చేయని కారణంగా.. గతంలో వాయిదా పడిన సభను ఎప్పుడైనా సమావేశపర్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు.. గత సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు ఉండబోతున్నాయి. కనుక గవర్నర్ ప్రసంగం అవసరం లేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ప్రొరోగ్ అయితే.. తదుపరి సెషన్ మొదటి సమావేశంలో గవర్నర్ ప్రసంగించే అవకాశం ఉంటుంది.
గవర్నర్ ప్రసంగం ఎప్పుడు ఉంటుందంటే..
శాసనసభ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం పరిపాటే. అయితే.. అందుకు కొన్ని సందర్భాలు ఉంటాయి.
1) ఏడాదికి ఒకసారి,
2) ప్రతి ఏడాదిలో మొదటి సెషన్లో,
3) ఎన్నికలు జరిగి, కొత్త సభ కొలువుదీరినప్పుడు. ఈ మూడు సందర్భాల్లో గవర్నర్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
కొత్త సెషన్ అంటే..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 (1) ప్రకారం అసెంబ్లీ ప్రొరోగ్ అయిన తర్వాత తిరిగి సమావేశ పరిస్తే దానిని కొత్త సెషన్‌గా పరిగణిస్తారు. ప్రొరోగ్ కాని పక్షంలో గత సభనే వాయిదా వేసి తిరిగి సమావేశ పరిచినట్టు భావిస్తారు. దీని ప్రకారం.. గతేడాది అక్టోబర్‌లో చివరిసారిగా తెలంగాణ శాసనసభ ఎనిమిదో సమావేశం, శాసనమండలి 18వ సమావేశం జరిగింది. ఆ సమావేశాలు పూర్తయిన తర్వాత శాసనసభ ప్రొరోగ్ కాలేదు. అంటే ఇప్పుడు జరుగబోయేవి గత శాసనసభ సమావేశాలకు పొడిగింపు మాత్రమే. కొత్త సమావేశంగా పరిగణించలేము. కనుక గవర్నర్ ప్రసంగం అనే ప్రసక్తే ఉండదని అధికారులు వివరిస్తున్నారు.
గతంలో ఎన్నో ఉదాహరణలు
గవర్నర్ ప్రసంగం లేకుండా సభను ప్రారంభించిన సంఘటనలు గతంలో అనేకం ఉన్నాయి.
- 1970లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్ల విజయభాసర్‌రెడ్డి ఆర్థిక మంత్రిగా, బీవీ సుబ్బారెడ్డి స్పీకర్‌గా ఉండేవారు. 1970 డిసెంబర్లో శాసన సభ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. నాటి గవర్నర్ ఖండూబాయి దేశాయిని ప్రభుత్వం సమావేశాలకు ఆహ్వానించలేదు. ఆ తర్వాత జూలైలో జరిగిన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించారు.
- 2013 మార్చి 13న అసెంబ్లీ సమావేశమైంది. ఆ తర్వాత 4 సిట్టింగులు కూడా జరిగాయి. 2014 ఫిబ్రవరి 10న బడ్జెట్‌ను ఆమోదించారు. అదే సెషన్లో జరిగిన సమావేశాలు కాబట్టి.. వాటికి అప్పటి ప్రభుత్వం గవర్నర్‌ను పిలువలేదు. 2014 జూన్ 11న అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కొత్తగా ఏర్పడిన సభను సమావేశపరిచినప్పుడు గవర్నర్ ప్రసంగించారు. సుమారు ఏడాదిన్నర కాలంపాటు సభలో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరిగాయి.
- ఏపీలో 2019 డిసెంబర్ 17న అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. కానీ ప్రొరోగ్ చేయలేదు. తిరిగి 2020 జనవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, ఆమోదించారు. ఆ సమయంలో గవర్నర్ ప్రసంగం లేదు. దీనికి కారణం కూడా ప్రొరోగ్ చేయకపోవడమే. 2020 జూన్ 16న తిరిగి సభను నిర్వహించినప్పుడు గవర్నర్ ప్రసంగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

