రేవంత్ పాలనలో రైతుల అరిగోస.. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం
ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాలో కరెంట్ కోతలతో వందలాది ఎకరాల్లో ఎండిన పంటలను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు.
- పెద్దగూడెంలో పంటల పరిశీలన
వనపర్తి టౌన్, అక్టోబర్ 19 : ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాలో కరెంట్ కోతలతో వందలాది ఎకరాల్లో ఎండిన పంటలను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులు రూప్లానాయక్, దేశ్యానాయక్, చందునాయక్, దూద్యా నాయక్ తదితరులు ఎండిన తమ పంటలను చూపుతూ నిరంజన్‌రెడ్డి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఎకరానికి రూ.25 వేలు పెట్టుబడి పెట్టామని, పొట్ట దశకు వచ్చిన పంట.. కరెంట్ కోతలతో కండ్ల ముందే నీళ్లందక ఎండిపోయినట్టు రైతులు విలపించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా రైతులను అరిగోస పెడుతున్నారని ధ్వజమెత్తారు. నష్టపోయిన పంటలపై రాష్ట్రవ్యాప్తంగా సమీక్ష నిర్వహించి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండున్నర కోట్ల మంది రైతులు ఆధారపడి ఉన్నారని, వారంతా తిరగబడే పరిస్థితిని ప్రభుత్వమే కల్పించిందని దుయ్యబట్టారు. రైతులు ఆధైర్యపడొద్దని, అండగా ఉంటామని, ప్రభుత్వంతో పోరాడి పరిహారం అందేలా చూస్తామని భరోసానిచ్చారు. ఒక్క పెద్దగూడెం తండాలోనే 15 ఎకరాల వరి నిలువునా ఎండిందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాల్లో సగటున 100 నుంచి 500 ఎకరాలు వానకాలం పంటలు ఎండిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటామని బహిరంగంగా చెప్తున్నారని అన్నారు. అయినా ఈ సర్కార్‌కు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో 70 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా, పాలమూరు, కేఎల్ఐ పంపులు నడపడం లేదని విమర్శించారు. గోదావరి, కృష్ణా నీళ్లు ఆంధ్రా పాల్జేశారని, కృష్ణా జలాలు 100 టీఎంసీలు తరలించుకుపోయారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనతో కృష్ణా నీటిని ఆంధ్రా సీఎం చంద్రబాబు 700 కి.మీ. దూరంలోని కుప్పానికి తరలించుకు వెళ్లినట్టు తెలిపారు. నీటిని ఒడిసి పట్టుకునే సోయి కాంగ్రెస్ సర్కార్‌కు లేకుండా పోయిందని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

