బరిలో నిలిపేందుకు
అభ్యర్థులు మీకు కరువు
కులం, మతం కుట్రలతో
వేయబోకు దరువు
ధరావత్తు దక్కితేనె
మిగులుతుంది మీ పరువు
ఉట్టి కెగరలేరు కాని
అందలానికై పరుగు
తొమ్మిదేండ్ల పాలనలో
మీరు చేసిన నిర్వాకమేది?
సిలిండరు బాదుడేమి,
పెట్రోలు ధర మంటలేమి?
రూపాయి విలువ
రోజుకింత తగ్గుడేమి?
గురివింద గుణమేమి,
గుండుసున్నా వ్యవహారమేమి?
– దండమూడి శ్రీచరణ్