తొమ్మిది మంది విద్యార్థులకు అస్వస్థత
అడవి ఆముదం గింజలు తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
పరిగి, నవంబర్ 17 : అడవి ఆముదం గింజలు తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్ తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం విరామ సమయంలో మూత్ర విసర్జనకు బయటకు వెళ్లారు. వీరిలో ఒకరు అడవి ఆముదం కాయలు తీసుకొచ్చారు. విద్యార్థులు ఆ కాయలు పగులగొట్టి గింజలు తిన్నారు.
దీంతో రెండో తరగతికి చెందిన తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారిని పరిగి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇందులో భావన అనే విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురవడంతో పరిగి నుంచి వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తరలించారు. మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

