ప్రజా సంఘాలపై ఎన్ ఐ ఏ.. ఒకే కేసులో 405 మందికి నోటీసులు ఇచ్చిన దర్యాప్తు సంస్థ
దేశంలోని మావోయిస్టులు 90 శాతం లొంగిపోయినా కూడా వారి సానుభూతిపరులంటూ ప్రజా సంఘాల నేతలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేసి, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): దేశంలోని మావోయిస్టులు 90 శాతం లొంగిపోయినా కూడా వారి సానుభూతిపరులంటూ ప్రజా సంఘాల నేతలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేసి, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. గత సెప్టెంబర్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలను ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా, తీగలకుంటపల్లిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్కడ ప్రసంగించిన ఇన్నయ్యపై ఎన్ఐఏ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ఇంకా మావోయిస్టు సానుభూతిపరులంటూ ఈ కేసులో సుమారు 405 మందికి ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది. వారిలో పలువురిని ఇప్పటికే విచారించింది.
ఈ క్రమంలో పలువురికి ఎన్ఐఏ వరుసగా నోటీసులు జారీచేస్తున్నది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 మందికి పైగా ఈ నోటీసులు అందుకున్నారు. వీరిలో సిధారెడ్డి సహా కొందరిని వారి ఇండ్ల వద్దకే వెళ్లి విచారించారు. మిగిలినవారు మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

