గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న పలు ఎన్జీవోలు
Green India Challenge | పర్యావరణ పరిరక్షణ, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ-ఉపాధి కల్పన కోసం... స్వచ్ఛంద సంస్థలు ఏకం కావాలని నిర్ణయించాయి. సమాజ సంక్షేమం కోసం వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఎన్జీవోలు ఒక తాటిపైకి వచ్చి పనిచేసినప్పుడే ఫలితాలు
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ-ఉపాధి కల్పన కోసం… స్వచ్ఛంద సంస్థలు ఏకం కావాలని నిర్ణయించాయి. సమాజ సంక్షేమం కోసం వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఎన్జీవోలు ఒక తాటిపైకి వచ్చి పనిచేసినప్పుడే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని వెల్లడించాయి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ప్రాంగణంలో నవ భారత నిర్మాణంలో ఎన్జీవోల పాత్ర అంశంపై సదస్సు జరిగింది. జీఎంఆర్ ఫౌండేషన్, వాక్ ఫర్ వాటర్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్, వందేమాతరం ఫౌండేషన్, గ్రామ బజార్, సీఎస్ఆర్ ఫౌండేషన్‌తోపాటు పలు పర్యావరణ, ఉపాధి శిక్షణ రంగాలకి చెందిన 60 ఎన్జీవో సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

పర్యావరణం, వ్యవసాయం, జలం, ఆరోగ్య రంగాల్లో ప్రభావవంతమైన మార్పుకోసం స్వచ్ఛంద సంస్థలన్నీ కలసి పనిచేయాలనే లక్ష్యంతో ప్రతి నెలలో చివరి శనివారం తామంతా ఒకచోట సమావేశమై తక్షణ, దీర్ఘకాల కార్యాచరణ ప్రణాళికలు, కార్యక్రమాలను నిర్ణయిస్తున్నట్లు ఆయా ఎన్జీవోల ప్రతినిధులు తెలిపారు. దేశంలో లక్షలాది ఎన్జీవోలు ఉన్నా… వాటన్నింటి మధ్య సమన్వయం లేక ఎవరికి వారే అన్నట్లుగా పనిచేస్తున్నందున… ఫలితాలు పెద్దగా ఉండడం లేదని పేర్కొన్నారు. ఎన్జీవోల వల్ల ఉపయోగం లేదనే దురభిప్రాయాన్ని తొలగించే విధంగా తామంతా ఒకే వేదికపైకి వచ్చి పరస్పర సహకారంతో సమష్ఠి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. సమావేశం అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు… జీఎంఆర్ ప్రాంగణంలో… ఆయా ఎన్జీవోల ముఖ్య సభ్యులతో మొక్కలు నాటించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

