నేటి నుంచి రేషన్‌కార్డుల పంపిణీ

- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రారంభించనున్న మంత్రి గంగుల
- రాష్ట్రవ్యాప్తంగా 3.09 లక్షల కొత్తకార్డులు జారీ
- లబ్ధిదారులకు ఆగస్టు నుంచి బియ్యం పంపిణీ
- మొత్తం 90.50 లక్షలకు రేషన్‌కార్డుల సంఖ్య
- కొత్త రేషన్ కార్డులు 3,09,083
- కొత్తగా లబ్ధిదారులు 8,65,430
- మొత్తం కార్డులు 90.50 లక్షలు
- మొత్తం లబ్ధిదారులు 2.88 కోట్లు
- ప్రతినెలా బియ్యం పంపిణీ 1.72 లక్షల టన్నులు
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ రేషన్‌కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆయాజిల్లాల్లో సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొంతకాలంగా రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఆగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు జారీచేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. వాటిని పరిశీలించిన పౌరసరఫరాలశాఖ అర్హులైన 3,09,083 మందికి కొత్త కార్డులను జారీచేసింది. వీటిద్వారా 8,65,430 మంది లబ్ధిపొందనున్నా రు. కొత్తకార్డులు పొందినవారికి ఆగస్టు నెల నుంచి రేషన్ బియ్యం పం పిణీ చేస్తారు. ఇందుకోసం ఇప్పటికేఉన్న కోటాకు అదనంగా రూ.168 కోట్లతో 5,200 టన్నుల బియ్యం సమకూరుస్తున్నారు. కొత్తగా జారీచేస్తున్న రేషన్‌కార్డులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే అధికంగా ఉన్నాయి. కొత్త కార్డు ల జారీతో రాష్ట్రంలో రేషన్‌కార్డుల సంఖ్యతోపాటు, లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరుగనున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో 87.41 లక్షల కార్డులు ఉం డగా 2.79 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కొత్తకార్డుల జారీతో కార్డుల సంఖ్య 90.50 లక్షలకు చేరనున్నది. అదేవిధంగా లబ్ధిదారుల సంఖ్య 2.88 కోట్లకు చేరుకుంటున్నది. రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నది. ఇందుకోసం ప్రతియేట సుమారు రూ.2,766 కోట్లకుపైగా వెచ్చిస్తున్నది. 2.88 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రతినెలా 6 కిలోల చొప్పున 1.72 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

