హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్ట పరిధిలోని పాపిరెడ్డి నగర్లో మామను అల్లుడు హత్యచేశాడు. పాపిరెడ్డినగర్కు చెందిన రాజమౌళి (50), బాలకృష్ణ (23) మామాఅల్లుళ్లు. మంగళవారం రాత్రి రాజమౌళిని బాలకృష్ణ కత్తితో పొడిచి హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.