తెలంగాణ విధానాలకు నేపాల్ ఫిదా
రాష్ట్రంలో మున్సిపల్‌శాఖ అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాలు ఇతర దేశాలను సైతం ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ పట్టణాల్లో అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు వివిధ దేశాలు తమ ప్రతినిధులను పంపిస్తున్నాయి.
- మున్సిపాలిటీలపై వరుస అధ్యయనాలు
- తాజాగా హైదరాబాద్‌లో మరో బృందం అధ్యయనం
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్‌శాఖ అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాలు ఇతర దేశాలను సైతం ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ పట్టణాల్లో అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు వివిధ దేశాలు తమ ప్రతినిధులను పంపిస్తున్నాయి. ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన ప్రతినిధులు ఒక దఫా అధ్యయనం చేసి వెళ్లగా, తాజాగా నేపాల్ నుంచి మరో ప్రతినిధి బృందం రాష్ర్టానికి వచ్చింది.
నేపాల్‌కు చెందిన 31 మంది ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రతినిధి బృందం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయాన్ని సోమవారం సందర్శించింది. మున్సిపల్‌శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న హరితహారం, ప్రజా మరుగుదొడ్లు, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ఎఫ్ఎస్టీపీలు, టీఎస్-బీపాస్, బయోమైనింగ్, ఇన్స్టాంట్ మ్యూటేషన్, ఇన్స్టాంట్ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తదితర కార్యక్రమాలు బాగున్నాయని నేపాల్ ప్రతినిధులు ప్రశంసించారు. ఈ తరహా కార్యక్రమాలను తమ దేశంలో కూడా అమలు చేస్తామని తెలిపారు. నేపాల్ బృందంలో మేయర్లు మనోజ్ కుమార్‌షా, ప్రశాంత్ బిస్త్, లక్ష్మీ మహారాజన్, కబిత తివారి గిరాహి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జాతీయ తైక్వాండో పోటీలకు కోచ్ కమ్ మేనేజర్‌గా అంబటి ప్రణీత్
ఈఎల్వీ భాస్కర్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ
Temparature | రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గుతాయన్న భారత వాతావరణ కేంద్రం..!
పదో తరగతి మండల టాపర్లకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోత్సాహక చెక్కులు
SP Ashok Kumar | కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి : ఎస్పీ అశోక్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

