NDSA | 2 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై ఎన్డీఎస్ఏ సమావేశం.. హాజరుకానున్న మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం భద్రతపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) మరికాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్న ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు హాజరుకానున్నారు.
హైదరాబాద్: కాళేశ్వరం భద్రతపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) మరికాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్న ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు హాజరుకానున్నారు. వర్షాకాలం, వరదలు రాకముందే.. జూలై మొదటి వారంలోపే సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని ఈ ఏడాది మే 5న ఇచ్చిన నివేదికలో ఎన్డీఎస్ఏ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ రెండో వారంలో కేంద్ర పభ్రుత్వ సంస్థలైన సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్ఎంఆర్ఎస్లతో సాంకేతిక పరీక్షలు చేయించాలని తెలంగాణ ప్రభుత్వం
నిర్ణయించింది. అయితే వరద రావడంతో ఆ పరీక్షలు నిలిచిపోయాయి.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి ఘోష్ కమిషన్ త్వరగా నివేదిక ఇవ్వాలని NDSAని కోరింది. దాని ఆధారంగా తాము తుది నివేదిక ఇవ్వాలని, ప్రాజెక్టును కొనసాగించడమా లేదా కొత్త నిర్మాణానికి వెళ్లాడమో సిఫార్సులు చేయాల్సి ఉందని కమిషన్ పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సమాచారం లేకపోవడంతో తాము నివేదిక ఇవ్వలేకపోతున్నట్లు కమిషన్కు ఎన్డీఎస్ఏ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏని కోరింది. దీంతో శనివారం మధ్యాహ్నం 2గం.లకు సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ సమాచారం పంపించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

