శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా శ్రీకార్తిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తరుణ్‌భాస్కర్ సంభాషణలందిస్తున్నారు. ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మాతలు. రీతూవర్మ కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ప్రపంచీకరణ, మానన శాస్త్రసాంకేతిక భావనను ఆవిష్కరిస్తూ క్రియేటివ్‌గా పోస్టర్‌ను తీర్చిదిద్దారు. ‘సైన్స్ ఫిక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్న కుటుంబ కథా చిత్రమిది. కథ, కథనాలు వినూత్నంగా ఉంటాయి. శర్వానంద్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అని చిత్రబృందం తెలిపింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్‌సారంగ్, సంగీతం: జేక్స్ బిజోయ్, మాటలు: తరుణ్‌భాస్కర్, నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రచన-దర్శకత్వం: శ్రీకార్తిక్.