ఎన్ఎండీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
నవరత్న ప్రభుత్వరంగ సంస్థ అయిన జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్ఎండీసీ) కాంట్రాక్టు పద్ధతితో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది.
హైదరాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ): నవరత్న ప్రభుత్వరంగ సంస్థ అయిన జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్ఎండీసీ) కాంట్రాక్టు పద్ధతితో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. సివిల్-9, మెకానికల్-5, పర్సనల్-21, ఎలక్ట్రికల్-3, మెటీరియల్ మేనేజ్మెంట్-1, సర్వే-2, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-4, సేఫ్టీ-8, ప్రాజెక్ట్ మానిటరింగ్ సెల్-13, లా-11, ఎన్విరాన్మెంట్-2, కార్పొరేట్ సొషల్ రెస్పాన్స్‌బులిటీ -2 పోస్టులు భర్తీ చేయనున్నట్టు చెప్పింది. గ్రాడ్యుయేషన్ లేక డిప్లొమా కలిగి, గరిష్ట వయసు 45 ఏండ్లకు మించకుండా ఉండాలని స్పష్టంచేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించింది.
మరికొన్ని వార్తలు చదవండి..
4 నుంచి ‘వెటర్నరీ’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): అనిమల్ హస్బెండ్రి (పశువైద్య, పశుసంవర్ధకశాఖలో) డిపార్టుమెంట్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(వీఏఎస్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జూలై 4 నుంచి 8వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. టీజీపీఎస్సీ అధికారులు శనివారం వెబ్నోట్తో పాటు షెడ్యూల్‌ను విడుదల చేశారు. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి వెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు. ఆప్షన్ల కోసం 3 నుంచి వెబ్సైట్ లింకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
రిక్రూట్మెంట్ బోర్డుపై ముందుకా? వెనక్కా?
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల నియామకాలకు ఉద్దేశించిన తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు -2022 బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతుంది. మొదట్లో కాస్త హడావిడి చేసిన ప్రస్తుతానికి ఈ అంశంపై సైలెంట్ అయ్యింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల రిక్రూట్మెంట్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడంలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కారు ఈ బిల్లును తీసుకొచ్చింది. అసెంబ్లీ ఆమోదించగా, అనంతరం ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించారు. గవర్నర్ ఈ బిల్లుపై పలు అంశాలను ప్రస్తావిస్తూ నిరుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. ఇంకా రాష్ట్రపతి పరిశీలనలోనే ఉంది. ఢిల్లీ నుంచి ఎలాంటి ముందడుగు పడకపోవడంతో ఏం చేయాలన్నది ప్రభుత్వం తేల్చుకోలేకపోతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

