బండి సంజయ్‌పై కేసు నమోదు చేసిన నల్లగొండ పోలీసులు
Nallagonda police registered a case against Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నల్లగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పర్యటన చేపట్టి, శాంతిభద్రతలకు విఘాతం కల్పించడంతో పాటు

నల్లగొండ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నల్లగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పర్యటన చేపట్టి, శాంతిభద్రతలకు విఘాతం కల్పించడంతో పాటు ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలిగించే విధంగా పర్యటన జరిగిన నేపథ్యంలో బండి సంజయ్, బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. సోమవారం బండి సంజయ్‌కుమార్ నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలపై కేసు నమోదు చేశామన్నారు.
బండి సంజయ్ పర్యటనను టీఆర్ఎస్ నేతలు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా లాఠీచార్జి చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా సభలు, సమావేశాలను అనుమతి లేదన్నారు. అదే క్రమంలో బీజేపీ నేతలు బండి సంజయ్ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం, పోలీస్‌శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత చివరి నిమిషంలో అనుమతి కోసం లేఖ ఇచ్చారన్నారు. నల్లగొండ పట్టణ శివారులోని అర్జాలబావి ఐకేపీ కేంద్రం వద్ద పర్యటన ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతిచోట ఉద్రిక్తత చోటు చేసుకున్నదన్నారు.
ముందస్తు సమాచారం, అనుమతి లేని కారణంగా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్లు, కోడిగుడ్లు వేస్తున్నారనే సమాచారంతో అప్పటికప్పుడు ఉన్న సిబ్బందితోనే పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని రంగనాథ్ వివరించారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో పర్యటనను టీఆర్ఎస్ నేతలు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో చోటు చేసుకున్న ఘటనలో పలువురు పోలీస్ సిబ్బందికి సైతం గాయాలయ్యాయన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

