నా బలగం.. నా శక్తి మీరే.. మునుగోడు సభలో కేసీఆర్
CM KCR | నా బలగం, నా శక్తి మీరే. మీ బలం చూసే మేం కొట్లాడేది. మీరే సహకరించకపోతే మేం ఏం చేయగలుగుతాం. ఇవాళ మీటర్లు పెట్టేవారికి ఏం అవకాశం ఇచ్చినా నన్ను పక్కకు జరిపేస్తారు. కేసీఆర్‌ను పడగొట్టి, తెలంగాణను కబ్జా చేద్దామనుకున్నారని
నల్లగొండ : నా బలగం, నా శక్తి మీరే. మీ బలం చూసే మేం కొట్లాడేది. మీరే సహకరించకపోతే మేం ఏం చేయగలుగుతాం. ఇవాళ మీటర్లు పెట్టేవారికి ఏం అవకాశం ఇచ్చినా నన్ను పక్కకు జరిపేస్తారు. కేసీఆర్‌ను పడగొట్టి, తెలంగాణను కబ్జా చేద్దామనుకున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ప్రయివేటీకరణ చేద్దామనుకునే వాళ్లకు ఈ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. భారతదేశంలో బంగారం లాంటి భూమి ఉంది. మానవ సంపద ఉన్నది. ఇవన్నీ వదిలిపెట్టి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ గద్దలకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోంది. రైతులు గమనించాలి. నష్టపోయేది, కష్టపడేది మనమే అనేది గుర్తుకు తెచ్చుకోవాలి. గత పాలకుల హయాంలో నీటి గోస తీరిందా? ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించలేదు. మునుగోడు ప్రజలను కాపాడండి అంటే నాటి బీజేపీ ప్రభుత్వం స్పందించలేదు. నేను కూడా ఇక్కడకు వచ్చిన ఏడ్చినా.. శివ్వన్నగూడెంలో నిద్ర చేసి, మేధావులతో మాట్లాడి చైతన్యం తీసుకొచ్చాను. సూడు సూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడ్ బండ అనే పాట నేనే రాశాను. నల్లగొండ, మునుగోడుకే కాదు.. భారత్‌కే నరకం చూపే జెండాలు మన మధ్య తిరుగుతున్నాయి. వాటిని గుర్తుపట్టాలి. ప్రజల్లో అమాయకత్వం ఉంటదో.. అప్పటి దాకా దుర్మార్గుల ఆటలు కొనసాగుతాయి. ఓటర్లు అందరూ అలవోకగా ఓటేసి ఇబ్బంది పడొద్దు అని కేసీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

