సిద్దిపేట : సిద్దిపేట మినీ ట్యాంక్‌బండ్‌కు మరో కొత్త కళ వచ్చింది. కోమటిచెరువుపై సంగీత జలదృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ సంగీత జలదృశ్యాన్ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బుధవారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు. కోమటి చెరువుపై లేజర్ లైట్ అండ్ మ్యూజికల్ ఫౌంటెన్ షో కనువిందు చేయనుంది. మ్యూజిక్‌తో పాటు.. విద్యుత్ కాంతులతో.. కోమటి చెరువు మురిసి, మెరిసిపోనుంది.