Adilabad | హత్యాయత్నం.. బీజేపీ నేతతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు
Adilabad | ఓ యువకుడిని చంపేందుకు యత్నించిన బీజేపీ నాయకుడు ఉష్కం రఘుపతితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ఐదు రోజుల కిందట వంశీ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది.
Adilabad | ఆదిలాబాద్ : ఓ యువకుడిని చంపేందుకు యత్నించిన బీజేపీ నాయకుడు ఉష్కం రఘుపతితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ఐదు రోజుల కిందట వంశీ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది.
తన కూతురితో వంశీ సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన రఘుపతి.. అతన్ని హత్య చేయించడానికి ప్రణాళిక రూపొందించాడు. పాత నేరస్థుడు రవితో రూ. 15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈనెల 18న రవి మరో వ్యక్తి అశోక్‌తో కలిసి స్కూటీపై వెళ్తున్న వంశీని వెనుక నుంచి జీపుతో ఢీకొట్టారు. దీంతో వంశీకి గాయాలయ్యాయి. వంశీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో బీజేపీ నాయకుడు రఘుపతితో పాటు ఆయన భార్య అరుంధతి, జోహాన్ రవి, అశోక్, దిల్షాన్, రాజులపై మావల పోలీసులు కేసు నమోదు చేశారు. జోహన్ రవి, అశోక్, దిల్షాన్, రాజులను అదుపులోకి తీసుకోగా, రఘుపతి, అరుంధతి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే దారుణం.. రెండేళ్లలో భారీగా పడిపోయిన పెట్టుబడులు.. టీజీఐపాస్ గణాంకాల్లో నిగ్గుతేలిన నిజాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

