మునుగోడు ఉపఎన్నిక.. పోలింగ్‌కు సర్వంసిద్ధం
Munugode bypoll | మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉపఎన్నిక పోలింగ్‌కు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రమైన చండూరులోని డాన్‌బోస్కో కాలేజీకి సిబ్బంది చేరుకున్నారు.
చండూరు: మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉపఎన్నిక పోలింగ్‌కు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రమైన చండూరులోని డాన్‌బోస్కో కాలేజీకి సిబ్బంది చేరుకున్నారు. గ్రామాల వారీగా సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అధికారులు పంపిణీ చేస్తున్నారు. సామాగ్రి తీసుకున్న సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో రేపు ఉదయం 7 గంటలకు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నెల 6న ఓట్లను లెక్కించనున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఉపఎన్నికను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు.
మండలాల వారీగా ఓటర్లు..
చౌటుప్పల్- 59,433 (పురుషులు- 29,882, మహిళలు- 29,547)
నారాయణపురం- 36,430 (పురుషులు- 18,446, మహిళలు- 17,984)
మునుగోడు- 35,780 (పురుషులు- 18,042, మహిళలు- 35,780)
చండూరు- 33,509 (పురుషులు- 16,848, మహిళలు- 16,661)
గట్టుప్పల్- 14,525 (పురుషులు- 7,368, మహిళలు- 7,157)
నాంపల్లి- 33,819 (పురుషులు- 16,856, మహిళలు- 16,962)
మర్రిగూడెం- 28,309 (పురుషులు- 14,230, మహిళలు- 14,078)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

