మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. 15 రౌండ్లలో పూర్తి
munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నవంబర్ 6వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్లగొండ
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నవంబర్ 6వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్లగొండ పట్టణంలోని అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
21 టేబుల్స్.. 15 రౌండ్లు..
ఓట్ల లెక్కింపునకు 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ లను నియమించారు. 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. మొత్తంగా 298 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది.
ఉదయం 9 గంటలకు తొలి రౌండ్ ఫలితం
మునుగోడులో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. తొలి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు విడుదల కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూర్తి స్థాయి ఫలితం వెలువడనుంది.
మొదటగా చౌటుప్పల్ మండలం ఓట్ల లెక్కింపు
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా.. మొదటగా చౌటుప్పల్ మండల పరిధిలో నమోదైన ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత నారాయణ పురం, మునుగోడు, చండూర్, మర్రిగూడం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లను వరుసగా లెక్చించనున్నారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత
కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో, సీసీ కెమెరా ల పర్యవేక్షణ లో 24 గంటల పాటు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

