తెలంగాణలో యథావిధిగా మున్సిపల్ ఎన్నికలు
మున్సిపల్ ఎన్నికలు | షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ర్ట ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. కొవిడ్

హైదరాబాద్ : కరోనా ఉధృతి దృష్ట్యా రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అంశంపై ఏర్పడిన గందరగోళానికి తెరపడింది. షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ర్ట ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తామని, అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం ఎస్ఈసీకి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అధికారులతో ఎస్ఈసీ చర్చించి.. ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా ఎస్ఈసీ పార్థసారథి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని.. రాష్ర్ట ప్రభుత్వం కోరిందని తెలిపారు. అధికారులతో చర్చించి ఎన్నికల ప్రక్రియ కొనసాగింపునకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని పేర్కొన్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ఆపాలని ఆదేశించారు. దీంతో 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది.
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాలిటీలకు 30వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

