MLC Kavitha | కవితకు బెయిల్ పొందే అర్హత ఉంది : న్యాయవాది రోహత్గీ
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు.
MLC Kavitha |బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టగా.. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు.
కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయని రోహత్గీ తెలిపారు. ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయ్యిందని న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. ఈడీ కేసులో 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారని అన్నారు. సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని చెప్పారు. ఈ కేసులో మొత్తం 493 మంది సాక్షుల విచారణ ముగిసిందని అన్నారు. కేసులో ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారని తెలిపారు.
కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని రోహత్గీ అన్నారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు. రూ.100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే అని అన్నారు.
దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇచ్చారని చెప్పారు. ఫోన్లు మార్చడంలో తప్పేముందని ప్రశ్నించారు. సౌత్ గ్రూప్ 100 కోట్లు అంటున్నారని.. కానీ దాన్ని రికవరీ చేయలేదని తెలిపారు. 493 మంది సాక్షులను విచారించారని అన్నారు. సాక్షులను బెదిరించారని చెబుతున్నారని.. కానీ ఎక్కడా ఎందుకు కేసులు నమోదు కాలేదని ప్రశ్నించారు. కవిత ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు.విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని అన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

