భూదాన్ పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ భవనంలో మిసెస్ తెలంగాణ, టై అండ్ డై అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫ్యాషన్‌షోలో మిసెస్ తెలంగాణ మమతాత్రివేది తళుక్కుమన్నారు.
వచ్చే నెలలో హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగే కార్యక్రమంలో పోచంపల్లి చేనేత వస్త్రాలు ధరించి ఫ్యాషన్ షో చేయబోతున్నట్టు ఆమె ప్రకటించారు. పోచంపల్లి ఇకత్ వస్త్రాలకు మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.
– భూదాన్‌పోచంపల్లి