Mandakrishna Madiga | తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయండి : మందకృష్ణ మాదిగ
Mandakrishna Madiga | ఎస్సీ వర్గీకరణపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన అమలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కోరారు.
Mandakrishna Madiga | హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన అమలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డా. కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య, మందుల శామ్యూల్ సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అమలుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో త్వరితగతిన అమలయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించాలని శాసనసభ్యులు, దళిత మేధావులు, సామాజికవేత్తలు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యులు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మేధావులు, సామాజికవేత్తలు చేసిన విజ్ఞప్తిపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో అమలుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన మేధావులు ప్రొఫెసర్ మల్లేశం, ప్రొఫెసర్ ఖాసీం, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండేటి మల్లయ్య, విజయ్ కుమార్ ముంజగళ్ళ, బాపిరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు మేడి పాపయ్య మాదిగ, గోవింద్ నరేష్‌లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

