మునుగోడు తీర్పు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనం: ఎంపీ సురేశ్ రెడ్డి
MP Suresh reddy | రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో
తిరుమల: రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వారికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా, అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల ఎంపీ సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమలకు వచ్చిన ప్రతిసారి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని, అన్నదమ్ములు స్ఫూర్తితో నేటికి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు.
మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు నేరవేర్చేలా కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే ప్రజలు విశ్వసిస్తున్నారని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

