హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని గురువారం ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు వైరస్ లక్షణాలు ఏమీ లేవని, పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని తేలిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని చెప్పారు. కరోనా విస్తృతి చెందకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని, స్టే హోం.. స్టే సేఫ్ అని ఆయన ట్వీట్‌చేశారు.