ఎన్నికవక ముందే ఎంపీ?
ఎన్నికలు జరుగలేదు.. ఫలితాలు వెలువడలేదు. కానీ.. కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పేరు మాత్రం.. సోషల్ మీడియాలో ఎంపీగా చెలామణి అవుతుండటం చర్చనీయాంశమవుతున్నది. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పేరిట ఫేస్బుక్లో ఫిబ్రవరి 3న ‘గడ్డం వంశీకృష్ణ ఎంపీ’ అని ఖాతా ఓపెన్ అయి ఉంది.
- ఫేస్బుక్లో గడ్డం వంశీకృష్ణ ఎంపీ పేరిట ఖాతా ఓపెన్
- కవర్ఫొటోలో వంశీ, సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేక్
పెద్దపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఎన్నికలు జరుగలేదు.. ఫలితాలు వెలువడలేదు. కానీ.. కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పేరు మాత్రం.. సోషల్ మీడియాలో ఎంపీగా చెలామణి అవుతుండటం చర్చనీయాంశమవుతున్నది. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పేరిట ఫేస్బుక్లో ఫిబ్రవరి 3న ‘గడ్డం వంశీకృష్ణ ఎంపీ’ అని ఖాతా ఓపెన్ అయి ఉంది. అంతేకాదు.. ఫేస్బుక్ డీపీగా గడ్డం వంశీకృష్ణ ఫొటో, కవర్ ఫొటోలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తన తండ్రి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫొటోలు కనిపిస్తున్నాయి.
ఈ ఎఫ్బీ ఖాతా తెరిచిన సమయానికి గడ్డం వంశీకృష్ణ ఎంపీ అభ్యర్థిత్వం కూడా ఖరారు కాలేదు. వర్క్స్ ఎట్ విశాఖ ఇండస్ట్రీస్, లైవ్స్ ఇన్ హైదరాబాద్ పేరుతో ఫేస్బుక్లో పోస్టింగ్‌లు చేస్తుండటంపై సొంత పార్టీ నుంచే అభ్యంతరం వ్యక్తమవుతున్నది. దీనిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పలువురు ఆయనకున్న పదవీ వ్యామోహానికి ఇదొక నిదర్శనమంటూ పేర్కొంటున్నారు. ఎన్నికల్లో గెలువకముందే ఆయన వ్యవహారశైలి ఇలా ఉంటే.. గెలిచిన తర్వాత ఎలా ఉంటుందోనని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే.. ఇది ఆయన అధికారిక ఖాతానా? లేక మరెవరైనా కావాలని గడ్డం వంశీకృష్ణ పేరుమీద ఎఫ్బీ ఖాతా ఓపెన్ చేశారా? అన్న విషయం తెలియరాలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

