వరద బాధితులకు కోటి రూపాయల సాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని వరద బాధితులకు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి అండగా నిలిచారు. బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో అనేక గ్రామాలు నీటమునగడంతో అక్కడి పేదలు సర్వం కోల్పోయారు.
- అందజేసిన ఎంపీ పార్థసారథిరెడ్డి
- ఎంపీలతో కలిసి పినపాకలో పర్యటన
ఖమ్మం, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని వరద బాధితులకు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి అండగా నిలిచారు. బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో అనేక గ్రామాలు నీటమునగడంతో అక్కడి పేదలు సర్వం కోల్పోయారు. గోదావరి ఉగ్రరూపం వల్ల జరిగిన నష్టం గురించి ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.. ఎంపీ బండి పార్థసారథిరెడ్డికి వివరించడంతో వెంటనే స్పందించి రూ.1,01,45,000 ఆర్థిక సాయం అందించారు. ఈ డబ్బుతో వరద బాధితులకు శనివారం నిత్యావసర వస్తువులు, బియ్యం అందజేశారు. విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఎంపీలు బండి పార్థసారథిరెడ్డి, కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు నియోజకవర్గంలో సరుకులు అందజేశారు. నియోజకవర్గంలో 15 వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందించనున్నారు.
కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు?
తెలంగాణలో వరద బీభత్సానికి ఎన్నో గ్రామాలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. కేంద్రం పట్టించుకోకపోయినా సీఎం కేసీఆర్ భద్రాచలం ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి రూ.1,000 కోట్ల సాయం అందించారని మణుగూరులో తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

