కమర్షియల్ స్పేస్‌కు భారీ గిరాకీ
జీవశాస్ర్తాలకు సంబంధించిన పరిశోధనాలయాలు, ఔషధ కంపెనీలకు నిలయమైన జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు వెల్లువెత్తుతుండటంతో కమర్షియల్ స్పేస్‌కు గిరాకీ పెరుగుతున్నది.
- రెండేండ్లలో 20 లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి
- బయో ఏషియా సదస్సుతో మరిన్ని కంపెనీల రాక
- లైట్‌హౌస్ కాంటన్ ఈడీ సుబ్రత కేవీ శర్మ వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): జీవశాస్ర్తాలకు సంబంధించిన పరిశోధనాలయాలు, ఔషధ కంపెనీలకు నిలయమైన జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు వెల్లువెత్తుతుండటంతో కమర్షియల్ స్పేస్‌కు గిరాకీ పెరుగుతున్నది. ఆ మేరకు వాణిజ్య స్థలాన్ని ఏర్పాటుచేసేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లైట్‌హౌస్ కాంటన్ జీనోమ్ వ్యాలీలో మరో మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్‌ను నిర్మించనున్నది. ఇప్పటికే లైట్‌హౌస్ కాంటన్‌కు ఇక్కడ మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ఉండగా, అందులో 30 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
జీవశాస్త్ర రంగ కంపెనీలకు అవసరమైన సానుకూల వ్యవస్థ హైదరాబాద్‌లో ఉన్నదని, ఇక్కడ ఈ రంగానికి సంబంధించిన కంపెనీల అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలున్నాయని లైట్‌హౌస్ కాంటన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుబ్రత కేవీ శర్మ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయోఏషియా సదస్సు ఈ రంగానికి సంబంధించిన భాగస్వాములను ఒకే వేదికపైకి చేర్చేందుకు తోడ్పడుతున్నదని అన్నారు. కంపెనీల రాకతో కమర్షియల్ స్పేస్‌కు కూడా భారీగా గిరాకీ ఏర్పడుతుందని, ఇది తమలాంటి రియల్ ఎస్టేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.
100 బిలియన్లకు లైఫ్‌సైన్సెస్ విలువ
రాష్ట్రంలో జీవశాస్త్ర అనుబంధ రంగ పరిశ్రమల విలువ 50 బిలియన్ డాలర్లు కాగా, వచ్చే ఐదేండ్లలో దీన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం ఈ రంగంలో నాలుగు లక్షలమందికి ఉపాధి లభించగా, వచ్చే ఐదేండ్లలో రెట్టింపు అవుతుందని శర్మ చెప్పారు. జీనోమ్‌వ్యాలీలోని నియో వింటేజ్ ఇన్నోవేషన్ పార్క్ స్పేస్‌లో 2,000 మంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీ-హబ్ (బయోఫార్మా హబ్)ను ఏర్పాటుచేస్తున్నదని, ఇది స్టార్టప్‌లు, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నదని శర్మ తెలిపారు. ప్రభుత్వం, టీఎస్ఐఐసీ, బయోటెక్నాలజీ శాఖ సంయుక్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో దీన్ని ఏర్పాటుచేస్తున్నదని చెప్పారు.
వచ్చే రెండేండ్లలో భారీ డిమాండ్
జీనోమ్ వ్యాలీలో కొత్త కంపెనీల రాక, ఉన్న కంపెనీల విస్తరణ ద్వారా రెండేండ్లలో కొత్తగా 20 లక్షల చరదపు అడుగుల స్పేస్ ఏర్పడనున్నది. దేశంలోనే మొదటి వ్యవస్థీకృత పరిశోధన, అభివృద్ధి క్లస్టర్ అయిన జీనోమ్‌వ్యాలీలో ప్రస్తుతం బయోటెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్, ఫార్మాస్యూటికల్‌కు చెందిన 200 కంపెనీలు పనిచేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్లగ్ అండ్ ప్లే సౌకర్యమున్న క్లస్టర్లలోకెల్లా ఇదే అతిపెద్దది.
జీనోమ్‌వ్యాలీలో కొత్త పెట్టుబడులు
- బయోలాజికల్ ఈ లిమిటెడ్, ఇండియన్ ఇమ్యునొలాజికల్స్ సంస్థలు రూ.2,500 కోట్లతో వ్యాక్సిన్ల తయారీ కేంద్రాలను నెలకొల్పనున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి.
- హెటిరో సంస్థ రూ.750 కోట్లతో ఔషధాల తయారీ కేంద్రాన్ని, రోచే కంపెనీ గ్లోబల్ అనరిటిక్ అండ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది.
- యూకేకు చెందిన ఆర్ఎక్స్-ప్రొపెల్లెంట్ తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీవశాస్ర్తాల ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తున్నది. ఆర్ఎక్స్-ప్రొపెల్లెంట్ భాగస్వామ్య కంపెనీలు రూ. 900 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి.
- ఆర్ఎక్స్-ప్రొపెల్లెంట్ వచ్చే రెండేండ్లలో జీనోమ్ వ్యాలీలో రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. దీనిద్వారా 3,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
- జీవీ రిసెర్చ్ ప్లాట్‌ఫామ్స్ (జీవీఆర్‌పీ) రూ.40 కోట్లతో 28,000 చదరపు అడుగుల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఈ కంపెనీ వచ్చే మూడేండ్లలో పరిశోధనా రంగంలో 10 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. దీనిద్వారా మరో 200 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
- యాపన్ బయో సంస్థ ఆర్ఎన్ఏ, డీఎన్ఏ, జన్యు థెరపీ ఉత్పత్తుల కేంద్రాన్ని మరింత విస్తరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

