గురుకుల ఉద్యోగుల సీపీఎస్ ఖాతాల్లోకి సొమ్ము
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ సీంకు సంబంధించిన సొమ్ము ఎట్టకేలకు శుక్రవారం ఉద్యోగుల సీపీఎస్ ఖాతాల్లో జమైంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగుల జీతాల నుంచి మినహాయిస్తున్న సొమ్మును పది నెలలుగా ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదంటూ ‘పది నెలలుగా జమకాని సీపీఎస్ సొమ్ము’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖను ఓ కుదుపు కుదిపేసింది.
- ‘నమస్తే’కథనంతో ఉన్నతాధికారుల్లో చలనం
- ఉద్యోగుల్లో ఆనందం
పెద్దపల్లి, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ సీంకు సంబంధించిన సొమ్ము ఎట్టకేలకు శుక్రవారం ఉద్యోగుల సీపీఎస్ ఖాతాల్లో జమైంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగుల జీతాల నుంచి మినహాయిస్తున్న సొమ్మును పది నెలలుగా ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదంటూ ‘పది నెలలుగా జమకాని సీపీఎస్ సొమ్ము’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖను ఓ కుదుపు కుదిపేసింది.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల కల్లా గురుకుల ఉద్యోగుల సీపీఎస్ ఖాతాల్లో సొమ్మును జమ చేశారు. డబ్బులు జమ చేసినట్టు నేరుగా ఉద్యోగులు వారి వాట్సాప్ గ్రూపుల్లో, వ్యక్తిగతంగా సైతం మెసేజ్‌లు పెట్టారు. 10 నెలలుగా సీపీఎస్ సొమ్ము ఎన్పీఎస్ ఖాతాలో జమకాకపోవడంతో దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగులు కోల్పోతున్నారని, రిటైర్మెంట్ తర్వాత జీవితం దారుణంగా మారబోతున్నదని కథనంలో వివరించింది. ఈ విషయాన్ని కొత్త సెక్రటరీ సీరియస్‌గా తీసుకొని వెంటనే డబ్బులను జమ చేయించగా, ఉద్యోగులు సంబురపడ్డారు. ‘నమస్తే తెలంగాణ’కు వారు ప్రత్యేక
కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

