TG Weather | తెలంగాణలో మళ్లీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..
TG Weather | తెలంగాణలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. ఉత్తర తమిళనాడు తీరం, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణశాఖ వివరించింది.
TG Weather | తెలంగాణలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. ఉత్తర తమిళనాడు తీరం, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణశాఖ వివరించింది. తెలంగాణలో మూడురోజుల పాటువర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
మంగళవారం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. గడిచిన 24గంటల్లో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

