హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మాడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలకు హాజరైన వారి మెరిట్ లిస్టును విడుదల చేసినట్టు మాడల్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి తెలిపారు. ర్యాంకులు, మార్కులు tgms.telangana. gov.in వెబ్సైట్లో తనిఖీలు చేసుకోవచ్చని సూచించారు.
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కార్ బడుల్లోని విద్యార్థులకు 2026-27 విద్యాసంవత్సరానికి 1,39,66,602 నోట్‌బుక్స్‌ను అందజేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌నికోలస్ తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి బుక్స్ పంపిణీ ప్రారంభమైందని, ఈ నెల 31 వరకు పంపిణీ పూర్తి చేస్తామన్నారు.