26న ఎమ్మెల్సీలుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి ప్రమాణం
ఎమ్మెల్సీలు | ఈ నెల 26వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మండలి చైర్మన్

హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మండలి చైర్మన్ వీరిద్దరి చేత ప్రమాణం చేయించనున్నారు. లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరగనుంది.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం సాధించిన విషయం తెలిసిందే. వాణీదేవి మొత్తం 1,89,339 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎన్. రాంచందర్‌రావుపై ఆమె గెలుపొందారు.
నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం అధికారులు ఆయన్ను విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

