Sathyavathi Rathod | రైతులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్సీ సత్యవతి
Sathyavathi Rathod | అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు(Farmers) ద్రోహం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(MLC Sathyavathi Rathod )అన్నారు.
మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 21: అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు(Farmers) ద్రోహం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(MLC Sathyavathi Rathod )అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీలో(Loan waiver) అనేక లోపాల వల్ల వారికి తీవ్ర నష్టం జరిగిందన్నారు.
ఏ గ్రామంలో చూసినా రుణమాఫీ కాని రైతులే ఎక్కువ ఉన్నారని, వారు ప్రతి రోజూ బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగినా సమస్యలను మాత్రం ప్రభుత్వం పరిష్కరించడం లేదని విమర్శించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు మాత్రం రైతు రుణ మాఫీ అవుతుందని, రాష్ట్రంలో ఉన్న నిరుపేద రైతులకు మాత్రం ప్రభుత్వం మాఫీ చేయలేదన్నారు.
రైతులకు రేషన్, ఆధార్ కార్డు సరిలేదని, ఒకే కుటుంబం అని అనేక రకాలు తప్పులను చూపి రుణాలను మాఫీ చేయలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను, మేధావులను ఇబ్బంది పెట్టే భాష వాడడం సరి కాదని, వెంటనే తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఒక స్వర్ణయుగంగా కొనసాగిందని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని, చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

